అనువాద కవిత్వం
Sunday, 28 June 2015
ఊగనీ అలా... by రవీంద్రనాథ్ టాగోర్.
ఊగనీ అలా
చిగురాకు చివరల
హిమ బిందువులా
కాలపు అంచుల పై
నర్తించని అలా
ఈ జీవితమనే కల !
ఆంగ్లం - రవీంద్రనాథ్ టాగోర్.
అనువాదం : సత్యప్రసాద్ పెమ్మరాజు.
Sunday, 14 June 2015
నేను నేను కాను.. by రూమీ (1207 - 1273)
నేను నేను కాను,
నువ్వు నువ్వు కావు,
నువ్వు నేను కాను.
నువ్వు నువ్వే కానీ
నువ్వు నేనే
మనమిలా ఒకటైన ప్రతిపూటా
వెర్రి మనసు అడిగేనొక మాట :
నేను నువ్వా లేక నువ్వు నేనా.
అనువాదం : సత్య ప్రసాద్ పెమ్మరాజు.
Friday, 5 June 2015
కల.. సీతాకోకచిలుకలా by చువాంగ్ జు.
నే కన్నానొక కల,
నేనొక సీతాకోకచిలుకలా !
ఎగురుతున్నా అంబరాన అలా అలా ;
మెలకువలో ఆశ్చర్యపోతున్నా ఇలా:
సీతాకోకచిలుకలా కలగన్న నేను మనిషినా?
లేక మనిషిలా కలగంటున్న సీతాకోకచిలుకనా?
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)