Tuesday 27 December 2016

జీవితం ... by ఒమర్ ఖయ్యాo (1048 – 1131)


మా బాల్యం, గురువులకు ఇచ్చేశాం అంకితం,
మా యవ్వనం, ఉరిమే ఉత్సాహానికి ఇచ్చేశాం అంకితం!
.
.
.
 ఈ జీవితమంటే ఏమిటి? గుప్పెడు బూడిద!
రివ్వున రేగే సుడిగాలికి ఇచ్చేస్తాం అంకితం!
 అనువాదం: సత్యప్రసాద్ పెమ్మరాజు.
***&***
.
In Persian:
.
یک چند به کودکی به استاد شدیم
یک چند به استادی خود  شاد شدیم
.
پایان سخن شنو که ما را چه رسید
از خاک برامدیم و بر باد  شدیم

Monday 3 August 2015

కుమ్మరి కొట్లో కుండల కబుర్లు..... by ఒమర్ ఖయ్యామ్ (1048 – 1131).




కుమ్మరి కొట్లో కుండల కబుర్లు విన్నానిలా : 
" ఏ రూపు లేని మన్నుముద్దలం అంతవరకు   
ఆ విధాత చేతుల పడే వరకు.  
ఎన్నో చేతుల్లో ఎగిరాం ఇంతవరకు,  
ఎంతో శాంతంగా ఉన్నాం అంతవరకు 
చివరకా తాగుబోతు చేతుల పడేవరకు 
విధి చేత నేలకు విసిరివేయబడేవరకు!" 

.
అనువాదం : సత్యప్రసాద్ పెమ్మరాజు 

చిత్రం : నజ్మా షరీఫ్. 

Tuesday 28 July 2015

ప్రియా! నిను పలుకరించేందుకు... by రూమీ (1207 – 1273)

.
ప్రియా! నిను పలుకరించేందుకు
నాకవసరమా పలుకులు?
కావా అవి గుచ్చుకునే 
నంగి పదముల ములుకులు? 
మాటల మాటును వదలి
భాషా బంధనమొదిలి
శబ్దపు పరిమితి దాటుతా !
మన అనుబంధం చాటుతా !
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్ . 
చిత్రం  : నజ్మా షరీఫ్.  









.
.
.

Wednesday 1 July 2015

స్తబ్ధత.. by రవీంద్రనాథ్ టాగోర్.



పర్వత అంతర్భాగాన 
స్తబ్ధత తన ఎత్తును 
ఆవిష్కరించుకుంటుంది;
సరస్సు ఉపరితలాన 
చలనం నిశ్చలమవుతుంది 
తన లోతును అంచనా వేసుకుంటూ. 

ఆంగ్లం : రవీంద్రనాథ్ టాగోర్.
అనువాదం : సత్యప్రసాద్ పెమ్మరాజు. 

Sunday 28 June 2015

ఊగనీ అలా... by రవీంద్రనాథ్ టాగోర్.



ఊగనీ అలా
చిగురాకు చివరల
హిమ బిందువులా 
కాలపు అంచుల పై
నర్తించని అలా
ఈ జీవితమనే కల !

ఆంగ్లం  - రవీంద్రనాథ్ టాగోర్.

అనువాదం : సత్యప్రసాద్ పెమ్మరాజు.


Sunday 14 June 2015

నేను నేను కాను.. by రూమీ (1207 - 1273)



నేను నేను కాను,నువ్వు నువ్వు కావు,
నువ్వు నేను కాను.నువ్వు నువ్వే కానీ నువ్వు నేనే 
మనమిలా ఒకటైన ప్రతిపూటా 
వెర్రి మనసు అడిగేనొక మాట : 
నేను నువ్వా లేక నువ్వు నేనా.

అనువాదం : సత్య ప్రసాద్ పెమ్మరాజు. 



Friday 5 June 2015

కల.. సీతాకోకచిలుకలా by చువాంగ్ జు.

నే కన్నానొక కల,
నేనొక సీతాకోకచిలుకలా !
ఎగురుతున్నా అంబరాన అలా అలా ;
మెలకువలో ఆశ్చర్యపోతున్నా ఇలా:
సీతాకోకచిలుకలా కలగన్న నేను మనిషినా?
లేక మనిషిలా కలగంటున్న సీతాకోకచిలుకనా?
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్.