Monday 3 August 2015

కుమ్మరి కొట్లో కుండల కబుర్లు..... by ఒమర్ ఖయ్యామ్ (1048 – 1131).




కుమ్మరి కొట్లో కుండల కబుర్లు విన్నానిలా : 
" ఏ రూపు లేని మన్నుముద్దలం అంతవరకు   
ఆ విధాత చేతుల పడే వరకు.  
ఎన్నో చేతుల్లో ఎగిరాం ఇంతవరకు,  
ఎంతో శాంతంగా ఉన్నాం అంతవరకు 
చివరకా తాగుబోతు చేతుల పడేవరకు 
విధి చేత నేలకు విసిరివేయబడేవరకు!" 

.
అనువాదం : సత్యప్రసాద్ పెమ్మరాజు 

చిత్రం : నజ్మా షరీఫ్. 

Tuesday 28 July 2015

ప్రియా! నిను పలుకరించేందుకు... by రూమీ (1207 – 1273)

.
ప్రియా! నిను పలుకరించేందుకు
నాకవసరమా పలుకులు?
కావా అవి గుచ్చుకునే 
నంగి పదముల ములుకులు? 
మాటల మాటును వదలి
భాషా బంధనమొదిలి
శబ్దపు పరిమితి దాటుతా !
మన అనుబంధం చాటుతా !
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్ . 
చిత్రం  : నజ్మా షరీఫ్.  









.
.
.

Wednesday 1 July 2015

స్తబ్ధత.. by రవీంద్రనాథ్ టాగోర్.



పర్వత అంతర్భాగాన 
స్తబ్ధత తన ఎత్తును 
ఆవిష్కరించుకుంటుంది;
సరస్సు ఉపరితలాన 
చలనం నిశ్చలమవుతుంది 
తన లోతును అంచనా వేసుకుంటూ. 

ఆంగ్లం : రవీంద్రనాథ్ టాగోర్.
అనువాదం : సత్యప్రసాద్ పెమ్మరాజు. 

Sunday 28 June 2015

ఊగనీ అలా... by రవీంద్రనాథ్ టాగోర్.



ఊగనీ అలా
చిగురాకు చివరల
హిమ బిందువులా 
కాలపు అంచుల పై
నర్తించని అలా
ఈ జీవితమనే కల !

ఆంగ్లం  - రవీంద్రనాథ్ టాగోర్.

అనువాదం : సత్యప్రసాద్ పెమ్మరాజు.


Sunday 14 June 2015

నేను నేను కాను.. by రూమీ (1207 - 1273)



నేను నేను కాను,నువ్వు నువ్వు కావు,
నువ్వు నేను కాను.నువ్వు నువ్వే కానీ నువ్వు నేనే 
మనమిలా ఒకటైన ప్రతిపూటా 
వెర్రి మనసు అడిగేనొక మాట : 
నేను నువ్వా లేక నువ్వు నేనా.

అనువాదం : సత్య ప్రసాద్ పెమ్మరాజు. 



Friday 5 June 2015

కల.. సీతాకోకచిలుకలా by చువాంగ్ జు.

నే కన్నానొక కల,
నేనొక సీతాకోకచిలుకలా !
ఎగురుతున్నా అంబరాన అలా అలా ;
మెలకువలో ఆశ్చర్యపోతున్నా ఇలా:
సీతాకోకచిలుకలా కలగన్న నేను మనిషినా?
లేక మనిషిలా కలగంటున్న సీతాకోకచిలుకనా?
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్.


Monday 25 May 2015

నేను కేవలమొక ధూళి కణం ! by రూమీ (1207 - 1273)


నీ మధుపాత్రన చిక్కి ఆనంద సాగరాన మునిగా,
నువ్వాడే పాచికలా నన్ను విసిరి పారేయ్,
సంతోషాలలో ఎగిరి గిరికీలు కొడతా !
నీ దెబ్బ పడకుంటే పడదు నా కవిత,
నువ్వెగిరే రెక్కల గుర్రం,
ఆ గాలిన ఎగిరిపడే నేనో ధూళి కణం !

-
-
-
అనువాదం : సత్య ప్రసాద్ పెమ్మరాజు,
చిత్రం : నజ్మా షరీఫ్.








Tuesday 28 April 2015

కవిత్వం కన్నా విలువైనది .. జీవితం !


మీ చిన్నారికి చిన్న వయసులోనే నేర్పవలసిన విషయాల జాబితా ఈ క్రింద ఇవ్వబడినది :
1. మీ ఆడ కూతురును ఎవ్వరి ఒళ్ళోను కూర్చోవద్దని హెచ్చరించండి , ఆఖరుకి స్వంత బంధువుల దగ్గరైనా కూడా.. 
2. మీ చిన్నారికి 2 సం. వయసు నిండిన తరువాత వారి ముందు ఎప్పుడూ దుస్తులు మార్చుకోవద్దు , మీరైనా చాటుకి వెళ్ళండి లేదా వారినైనా పంపండి
3. ఏ పెద్దవారి నోటి వెంట మీ చిన్నారిని "నా భార్య " అని కాని "నా మొగుడు " అని కాని అననివ్వకండి
4. మీ చిన్నారి తన స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళ్ళినపుడు ఎటువంటి ఆటలు ఆడుతున్నారో ఒక కంట కనిపెట్టి ఉండండి. 
5. మీ చిన్నారికి ఇష్టం లేని ఏ పెద్దవారి వద్దకు బలవంతంగా పంపకండి అలాగే ఎవరినా ఒక పెద్దవారితో చాలా చనువుగా వ్యవహరిస్తున్నా ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. 
6. చలాకీగా తిరుగుతున్న చిన్నారి ఒక్కసారిగా డల్ అయిపోతే మీరు ఓపిక చేసుకుని చాలా ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి. 
7. మీ పెరిగిన పిల్లలకు సరైన శ్రంగార విలువలు బోధించండి, మీరా పని చేయకుంటే సమాజం వారికి తప్పుడు విలువలు నేర్పిస్తుంది. 
8. మీరు వారికోసం కొని తెచ్చిన కొత్త బొమ్మల పుస్తకాల వంటివి వారి కన్నా ముందు మీరొకసారి చూడటం ఉత్తమం. 
9. మీ కేబుల్ టీవిలో ఇంటర్నెట్లో "పేరెంటల్ కంట్రోల్స్ " యాక్టివేట్ చేయండి, తరచుగా వెళ్ళే స్నేహితుల ఇళ్ళలో కూడా వారిని ఈ పని చేయమని చెప్పండి. 
10. మీ 3 సం. పిల్లలకు వారి మర్మావయవాలు ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పించండి. ఆ ప్రదేశాలను ఎవ్వరిని తాకనివ్వకూడదని హెచ్చరించండి చివరకు అది మీరైనా సరే .. ( గుర్తు పెట్టుకోండి దానగుణం ఇంటి నుంచే మొదలవుతుంది , మీ నుంచే )
11. మీ చిన్నారి మానానికి చేటు చేస్తాయని మీరు భావించే కొన్ని వస్తువులు లేదా కొందరు మనుషులను నిషేదించండి ( అది మ్యూజిక్ , సినిమాలు మరియు ఫ్రెండ్స్ చివరకు కుటుంబ సభ్యులైనా కాని .) 
12. గుంపు మనస్తత్వానికి దూరంగా నిలబడగలగటంలో ఉన్న విలువను మీ చిన్నారికి బోధించండి. 
13. ఎవరైనా ఒక వ్యక్తి పైన మీ చిన్నారి ఫిర్యాదు చేస్తే, మౌనంగా ఉండకండి. మీరు వారిని రక్షించగలరని వారికి చూపించండి. 
మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఇది ఉపయోగపదుతుంది అనుకుంటే దయచేసి "షేర్ " చేయండి. ధన్యవాదములు !
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్. 

Sunday 26 April 2015

ఒక పాట ! - by అహ్మద్ షామ్లో (1925 - 2000).

అరణ్యం కన్నా చిక్కనైన కొన్ని ఆకులను దూశా,
నా పాటకు ప్రాణం పోశా !
హ్రదయపు వేగం మించిన అలలను పట్టా,
నా ఈ పాటన పెట్టా !
యుద్ధ నగారా మించిన ధ్వనితో నా ప్రేమను
ఈ గీతమునందున చెక్కా ! 
-.-.-.-
అడవిని మించిన పచ్చదనం 
ఆకులనింపెను , నా పాట !
సాగర ఘోష ను మించిన వేగం    
అలలను ఊపెను, నా పాట !
హ్రదయ తంత్రుల లోతున మ్రోగే 
ప్రాణ శ్వాస నిండిన ప్రేమ గీతం - 
నీ విరహంలో నే విడచా !
.
.
.
.
అనువాదం : పెమ్మరాజు  సత్య ప్రసాద్. 
చిత్రం        : నజ్మా షరీఫ్.

Tuesday 14 April 2015

విలువలు నిండిన కన్నులకు ..! __ by రూమీ. (1207 – 1273)


విలువలు నిండిన కన్నులకు వదనపు విలువలు మసకలులే !
దుస్తులు చీలిక పేలికలైనా నీకేనాడు దిగులుండదులే !

నీ సత్తా చూపాలా? ముందా పట్టు పీతాంబరాలు విడిచేయ్ !
రా, ఉత్త గోచీ తో...  జ్ఞానమనే గోదాలోకి అడుగేయ్ !

మా చూపంతా లో లోపలికే , మమ్మల్ని పట్టగలిగేదొక్క మనసే !
పలికే మాటలు వినరావు ! వేసిన ముసుగులు మాకు కనరావు !
-
-
-

అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్. 
చిత్రం : నజ్మా షరీఫ్. 
***&***