కుమ్మరి కొట్లో కుండల కబుర్లు విన్నానిలా :
" ఏ రూపు లేని మన్నుముద్దలం అంతవరకు
ఆ విధాత చేతుల పడే వరకు.
ఎన్నో చేతుల్లో ఎగిరాం ఇంతవరకు,
ఎంతో శాంతంగా ఉన్నాం అంతవరకు
చివరకా తాగుబోతు చేతుల పడేవరకు
విధి చేత నేలకు విసిరివేయబడేవరకు!"
.
అనువాదం : సత్యప్రసాద్ పెమ్మరాజు
చిత్రం : నజ్మా షరీఫ్.