ఆ ఊహే నాకు చాలు!
చిక్కుపడిన చికాకువలల
చిక్కుముడులు విప్పుకునే
ఈ నిశీధిపక్షి కి తోడుగా
నీ నిద్రన అద్రశ్యమై నా దరి చేరావు!
విరహంలో నీ విముక్త హ్రదయం
కలలలో తేలుతోంది,
నీ దేహం మాత్రం
సుదూరంలో శ్వాసిస్తోంది,
నిశీధిలో నిశ్శబ్దంలో
మొలకెత్తే,నా కలలు
తీర్చడానికై తనను తాను
తీర్చిదిద్దుకుంటోoది !
మెలకువలో నీ తీరు వేరు,
ఉదయంలో నీ జీవితం వేరు,
కాని, వాస్తవానికి భ్రమకు మధ్యన
సరిహద్దులు చెరిపేసే
రాతిరి వేళల్లో.. మన సమాగమం!
ఇంకా ఏదో మిగులుంది,
జీవితవెలుగుల వైపు ఇరువురిని లాగుతోంది,
పెనవేసిన రహస్య జీవుల ఉనికిని
నీడలలో దాచేసే
ఆ జీవాగ్ని !!
No comments:
Post a Comment