Tuesday 28 April 2015

కవిత్వం కన్నా విలువైనది .. జీవితం !


మీ చిన్నారికి చిన్న వయసులోనే నేర్పవలసిన విషయాల జాబితా ఈ క్రింద ఇవ్వబడినది :
1. మీ ఆడ కూతురును ఎవ్వరి ఒళ్ళోను కూర్చోవద్దని హెచ్చరించండి , ఆఖరుకి స్వంత బంధువుల దగ్గరైనా కూడా.. 
2. మీ చిన్నారికి 2 సం. వయసు నిండిన తరువాత వారి ముందు ఎప్పుడూ దుస్తులు మార్చుకోవద్దు , మీరైనా చాటుకి వెళ్ళండి లేదా వారినైనా పంపండి
3. ఏ పెద్దవారి నోటి వెంట మీ చిన్నారిని "నా భార్య " అని కాని "నా మొగుడు " అని కాని అననివ్వకండి
4. మీ చిన్నారి తన స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళ్ళినపుడు ఎటువంటి ఆటలు ఆడుతున్నారో ఒక కంట కనిపెట్టి ఉండండి. 
5. మీ చిన్నారికి ఇష్టం లేని ఏ పెద్దవారి వద్దకు బలవంతంగా పంపకండి అలాగే ఎవరినా ఒక పెద్దవారితో చాలా చనువుగా వ్యవహరిస్తున్నా ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. 
6. చలాకీగా తిరుగుతున్న చిన్నారి ఒక్కసారిగా డల్ అయిపోతే మీరు ఓపిక చేసుకుని చాలా ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి. 
7. మీ పెరిగిన పిల్లలకు సరైన శ్రంగార విలువలు బోధించండి, మీరా పని చేయకుంటే సమాజం వారికి తప్పుడు విలువలు నేర్పిస్తుంది. 
8. మీరు వారికోసం కొని తెచ్చిన కొత్త బొమ్మల పుస్తకాల వంటివి వారి కన్నా ముందు మీరొకసారి చూడటం ఉత్తమం. 
9. మీ కేబుల్ టీవిలో ఇంటర్నెట్లో "పేరెంటల్ కంట్రోల్స్ " యాక్టివేట్ చేయండి, తరచుగా వెళ్ళే స్నేహితుల ఇళ్ళలో కూడా వారిని ఈ పని చేయమని చెప్పండి. 
10. మీ 3 సం. పిల్లలకు వారి మర్మావయవాలు ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పించండి. ఆ ప్రదేశాలను ఎవ్వరిని తాకనివ్వకూడదని హెచ్చరించండి చివరకు అది మీరైనా సరే .. ( గుర్తు పెట్టుకోండి దానగుణం ఇంటి నుంచే మొదలవుతుంది , మీ నుంచే )
11. మీ చిన్నారి మానానికి చేటు చేస్తాయని మీరు భావించే కొన్ని వస్తువులు లేదా కొందరు మనుషులను నిషేదించండి ( అది మ్యూజిక్ , సినిమాలు మరియు ఫ్రెండ్స్ చివరకు కుటుంబ సభ్యులైనా కాని .) 
12. గుంపు మనస్తత్వానికి దూరంగా నిలబడగలగటంలో ఉన్న విలువను మీ చిన్నారికి బోధించండి. 
13. ఎవరైనా ఒక వ్యక్తి పైన మీ చిన్నారి ఫిర్యాదు చేస్తే, మౌనంగా ఉండకండి. మీరు వారిని రక్షించగలరని వారికి చూపించండి. 
మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఇది ఉపయోగపదుతుంది అనుకుంటే దయచేసి "షేర్ " చేయండి. ధన్యవాదములు !
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్. 

No comments:

Post a Comment