నువ్వే నా రాణీవి.
నీ కన్నా పొడవైన స్త్రీలున్నారు, పొడవరులు
నీ కన్నా స్వచ్ఛమైన స్త్రీలున్నారు, స్వచ్ఛంగా
నీ కన్నా ముద్దుగుమ్మలున్నారు , ముద్దుముద్దుగా
కాని నువ్వే నా రాణివి !
పురవీధుల్లో నీ నడక సాగుతుండగా ,
నిన్నెవ్వరూ గుర్తించరు,
నీ వజ్రఖచిత కిరీటాన్ని కనలేరు , నీ నడక సాగే
ఎర్రటి బంగారు రంగు తివాచీని సైతం
ఎవరూ చూడలేరు.
అది మాయా తివాచీ !
నిను చూసిన క్షణం
నా దేహంలో నదుల గలగల , ఉదరంలో
ఆకాశంలో కంపనం
ఈ ప్రపంచమే ఒక పద్యం !
కేవలం నువ్వు - నేను
కేవలం నువ్వు - నేను మాత్రమే
దానిని వినగలం !!
No comments:
Post a Comment