
నా కనులు నను విడచి వెళ్లి పోయాయ్ ,
నా ప్రక్క నడచి వెళ్ళిన ఒక నల్ల పిల్ల వెంట పడి.
తేనె రంగు నల్ల ద్రాక్షలు నలిపి చేసిన
నల్ల ముత్యాల రాశి ఆమె !
అగ్ని వాలము తో ఆమె కొట్టిన దెబ్బకు
నేను రక్తమోడాను !
ఇలాంటన్నింటి వెంటా నేను పడుతుంటాను !
శ్వేతవర్ణ స్త్రీ ఒకతి, తన సువర్ణ కేశాలనే
కిరిటంగా మార్చి బంగారు కాంతులను
ప్రదర్శిస్తూ వెళ్ళింది నా ప్రక్కగా.
నా నోరు అలలు అలలు గా సాగి
ఆమె ఎదపై
నెత్తురు పిడుగులు కురిపించింది !
ఇలాంటన్నింటి వెంటా నేను పడుతుంటాను !
కాని నువ్వు నా ప్రక్కన లేకున్నా ,
సుదూరంగా ఉన్నా, కనుల ముందు లేకున్నా,
నా నెత్తురు , ముద్దులూ నీకే !
నా నల్ల ముత్యమా , నా స్వర్ణ సుందరీ
నా బొద్దు పిల్ల , నా మెరుపుతీగా
నా అనాకారీ , నా సుందరీ
నువ్వొక బంగారు రాశి
వెండి కుప్ప, గోధుమ రాశి
ఈ నేలా ఇంకా సముద్రపు ఉప్పునీరు కలిపి
నిన్నుతయారు చేసిందే
నా కౌగిలికై , నా ముద్దులకై
ఇంకా, నా ఆత్మ కోసమై !!
No comments:
Post a Comment