అగ్గిలో రేగే నిప్పురవ్వల మాలికవనో
ఉప్పు చల్లిన రోజా పుష్పానివనో, లేదా
అరుదైన పుష్యరాగానివనో
నిన్ను నేను ప్రేమించను!
ఆత్మకు, నీడకు నడుమన దాగిన కొన్ని
అనివార్య నిగూఢ విషయాల మాదిరి, రహస్యంగా
నిన్ను నేను ప్రేమిస్తాను!
నిన్ను నేను ప్రేమిస్తాను,
ఎన్నటికీ పుష్పించలేనని తెలిసికూడా
పుష్పశోభల వెలుగులను రహస్యంగా తనలో మ్రోసే
పూల మొక్కను, ప్రేమించినట్లుగా..
నీ ప్రేమకు కృతజ్ఞతలు :
అనురాగ జల్లులలో తడిసిన ధరిత్రి
వెదజల్లే ఘాటుపరిమళాలను
నా హ్రదయంలో పుట్టించినందుకు!
ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రేమించాలో కూడా తెలియదు, కాని
నిన్ను నేను ప్రేమిస్తా !
అహంకారమో గందరగోళమో లేకుండా సూటిగా
నిన్ను నేను ప్రేమిస్తా !
అది అంతే, ఎందుకంటే మరో దారి తెలియదు నాకు.
ఇప్పుడింక నువ్వూ లేవు, నేను లేను,దూరమూ లేదు.
ఎంత దగ్గరో.. నా గుండెల మీద వేసిన నీ చేయి... నా చేయే,
ఎంత దగ్గరో.. నా నిద్రలో మూతలు పడే కన్నులు .... నీవే!!

No comments:
Post a Comment