ఈ సంధ్య కూడా మన చేజారిపోయింది.

ఈ సాయం సమయం లో
చేతిలో చేయి కలిపిన మన జంట
ఎవరికంటా పడలేదు!
నేను చూసాను, నా గవాక్షం గుండా
సుదూర పర్వత శ్రంగాల పై
సూర్య అస్తమ ఉత్సవం!
ఆ సూర్యబింబo
కాలుతున్ననాణెంలా
నా అరచేతిన మండుతుంది,
కొన్నిసార్లు!
నీకూ తెలుసు, విరహంలో
నీ జ్ఞాపకం
నా ఆత్మను పిండుతుంది,
కొన్నిసార్లు!
ఎక్కడున్నావ్ అప్పుడు నువ్వు?
అక్కడ ఇంకెవరున్నారు?
ఏమంటున్నారు?
ఎందుకని ఇంత ప్రేమ హఠాత్తుగా
నామీద ఊడిపడుతుంది, నువు
దూరమైపోయావని నేను దిగులు పడే క్షణాలలో?
ఈ సంధ్యలో మూసిన పుస్తకమొకటి
చేజారిపడింది, నా పాదాల వద్ద
నా నీలపు స్వెట్టర్ ఒకటి
గాయపడిన కుక్క మాదిరి
ఉండచుట్టుకు పడుంది.
ప్రతిసారి ! ప్రతీసారీ ! ఆ సాయంసమయాలలో..
శిలావిగ్రహాలను సైతం చెరిపేసే సంధ్యలలోకలసిపోయి,
నువ్వు దూరమైపోతూనే ఉంటావు !!!
No comments:
Post a Comment