నువ్వు లేని నేను
నేను నేను కాను.
నువ్వు రాని పొద్దు
వేకువ వేటుకు తెగి
చీకటి పుష్పం విరియదు!
అటుపై,
పొగమంచు శిలలపై
నీ నడకలు సాగకున్నా,
నీ ఎత్తిన చేతి కాగడా
సువర్ణజ్వాలల కాంతులు
వేరెవరూ నమ్మలేకున్నా,
ఆ రోజా పూల కాంతుల
జన్మరహస్యం మాత్రం
నీ ఉనికిని చాటుతుంది!
చివరకు నువ్వున్నా లేకున్నా
నీ ఉనికి; నీ రాక ;
హఠాత్తుగా, ఉత్తేజంగా
నాకు, నా జీవితరహస్యాన్ని
తెలుపుతుంది.
రోజా చెట్ల వెలుగులు
గాలుల్లో గోధుమలు
నను వెంటాడేది 'నీ వలనే' !
'నీ వలనే' నను వెంటాడేది;
అదే నేను; అదే మనము;
అదే ఈ ఉనికికి కారణం,
కేవలం... ఆ ప్రేమ !
నీకైనా... నాకైనా... మనకైనా...
No comments:
Post a Comment