
నా కోసం నీ చేతులు ఎగిరినపుడు,ప్రియా!
ఆ ఊపు లో నాకోసం అవి తెచ్చేది ఏమిటో?
నా అధరాలను తాకి హఠాత్తుగా
అవి ఎందుకు ఆగుతాయి,
ఎందుకని నాకు,నీ కరస్పర్శ చిరపరిచితమని అనిపిస్తుంది?
అవి నా పాలభాగాన్నినిమిరాయి, నా పొట్టను తాకాయనే భావన ఎందుకని?
అసలంటూ, నేనింకా పుట్టక మునుపే ....
ఆ నాజుకూదనం, యుగాల గుండా ,సాగరాలు దాటి,
పొగమంచులో నుంచి వసంతo మీదుగా విహరిస్తూ
వచ్చివాటిలో చేరింది!
ఆ సువర్ణ కపోత రెక్కలస్పర్శ, నాకు తెలుసు,
నీ చేతులు నా హ్రదయంపై వాలినపుడు !
ఆ మట్టి రంగు నాకు తెలుసు.
నా జీవితకాలమంతా వెతుకులాటే,
అగోచర మార్గాలు,
ఎక్కిదిగే మెట్లు ఎగిరి దాటే లోయలు.
రైళ్ళు నన్ను విసిరిపారేసాయి, సముద్రం అక్కున చేర్చుకుంది.
చివరకు, ద్రాక్షాపండ్లను తాకి చూశాను నీ స్పర్శను!
హఠాత్తుగా అరణ్యం నీ ఉనికిని తెలిపింది,
బాదంచెట్టు తన ఆకులలో నిను దాచింది,
నీ గమ్యాన్ని చేరేవరకూ
నీ రెక్కలు
ముడిచి నా గుండెలపై వాలేవరకూ!
No comments:
Post a Comment