
ముంగి సముద్రం వద్దకు వచ్చారు ముదుసలి స్త్రీలు
మెడలకు చుట్టుకున్న వారి శాలువాలతో,
బీటలువారిన పలుచని పాదాలతో...
ఒంటరిగా కూర్చుని ఉంటారు, తీరంలో
కనులు కదపరు చేతులు మెదపరు
మేఘాలనూ కదల్చరు మౌనాన్నీవిడువరు.
నీచపు సముద్రం భళ్ళున దూకుతుంది
మహిష గంగడోలు ఊగిస్తూ ఉరుకుతుంది
గర్జిస్తూ పంజాలు విసురుతుంది.
ఒద్దిక ముసలిపడతులు కూర్చునే ఉంటారు,
గాజు పడవలో ప్రయాణికులు
ఉగ్రవాద అలలను చూస్తున్నట్లుగా.
వాళ్ళెక్కడికి పోతారు? వాళ్ళెక్కడనుంచి వచ్చారు ?
ప్రతి మలుపు నుంచి వారు వస్తారు
మన స్వంత జీవితాలనుంచే వారు వస్తారు.
ఇప్పుడు వారికి మిగిలింది సముద్రo.
శీతలంగా కాల్చేస్తున్న శూన్యత్వం,
భగ భగ మండే ఒంటరితనం !
ప్రతి గతం నుంచి వారు వస్తారు,
ముక్కలైపోయిన ఇళ్ళలోనుంచి,
బూడిదైపోయిన సాయంత్రాలనుంచి.
వాళ్ళు చూస్తే చూస్తారు, లేదా చూడరు సముద్రాన్ని
వాళ్ళ చేతికర్రలతో ఇసుకలో ఏవో గుర్తులు గీస్తారు
సముద్రం వారి చక్కని దస్తూరిని తుడిచేస్తుంది.
ముదుసలి స్త్రీలు లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
వారి నాజూకు పక్షి పాదాలతో.
గాలిలో ఎగురుతూ అలలు
నగ్నంగా నర్తిస్తూనే ఉంటాయి !!
ఒంటరితనం శూన్యం నిరీహ తో పొద్దువాటారిపోతున్న ముసలిఅవ్వను నెరుడా చిత్రించిన వైనాన్ని సత్యప్రసాద్ ఒడుపుగా తెలుగుసేత చేశారు!
ReplyDelete