
నీది కష్టమో, దిగులో, భయమో ఏమైనా కాని,
నా హ్రదయంలో నీ స్థానం పదిలం.
ఇది నా హ్రదయభారమో, లేక
నీ పై అనురాగమో !
ప్రియా !
నిరంతరమూ నేనందించే
జీవనమాధుర్య బహుమానమందుకొని
ఓపలేని హాయితో మూతలుపడే నీ
నయనాల దాగున్న అనుభూతి కూడా అదే !
నా ప్రేమా! నీటితో తీరని దప్పికలో
మనం నెత్తురు త్రాగాం.
ఆకలి తీరక రగిలిన
కోరికల జ్వాలాగ్ని
కరచిన గాయాలమయ్యాం!
కానీ,
ఎదురుచూడు నా కోసం
నీ మాధుర్యం జర భద్రం,
వస్తూ వస్తూ నే తెస్తా
నీ కై ఒక రోజా పుష్పం!!
No comments:
Post a Comment