మన లాంటి ప్రేమికులు ఉన్నారా, అసలు ఎప్పుడైనా?
పద, యుగాల పూర్వమే కాలిబూడిదైన
ఆ హ్రదయాన్ని వెదకి, దానికి
ముద్దు మీద ముద్దు పెడుతూనే ఉందాం,
ఎన్నడో అంతరించిపోయిన ఆ ప్రేమ పుష్పం
మళ్ళీ వికసించేవరకూ!!
తన ప్రేమ ఫలాన్ని తానే తిని,
దాని రూపాన్నీ, శక్తినీ సంతరించుకుని
దివి నుంచి భువికి జారిన
అపర ప్రేమ లాగా
మనం ప్రేమించుకుందాం !
కొనసాగుతున్న ఆ అమృత ఫలం యొక్క
మృదువైన మెరుపు తళుకే నువ్వు,నేను !
హిమసమాధైన వసంతాలనూ ,విస్మృత శిశిరాలనూ
దాచుకున్న అనాది సుషుప్తావస్థను వదిలించే
కొత్త గాయాన్ని రేపుదాం,
ఆ ఆపిల్ ను కొరుకుదాం !
దాని రుచిచూసి ,మౌనంగా
కాలగర్భంలో సమాధైన అధరాలకు
కొత్త వారసులవుదాం !!
No comments:
Post a Comment