
నాజూకుదనమో రాసిపెట్టున్నదే
నాకోసం !
నీ దేహాన్ని తడిమిన ప్రతిచోట
నా చేతుల్లో ఒదిగేనొక గువ్వ!
అవి మెత్తిన నీ మట్టి దేహం,
తయారైందే
నా కుమ్మరి చేతుల కోసం !
నీ మోకాళ్ళు , నీ వక్షాలు, నీ నడుము -
నాలో మాయమై నీలో వెలిసిన
నా దేహభాగాలు,
తాపాలు రగిలే
పుడమి బొరియల్లో
మాయమైన
మట్టి రూపాలు !
కనుక, జంటగా మనమిద్దరం,
ఒక నిండు నదిలా..ఒక మట్టి రేణువులా..
సంపూర్ణం !!
naaku praanam pablo neruda,meeku laage.oka matti renuvula athani kavithvam sampoornam.
ReplyDelete